బైస దేవదాసుకు పురస్కారం


Sun,August 25, 2019 03:34 AM

తెలుగుయూనివర్సిటీ : ప్రముఖ పాత్రికేయులు, నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైస దేవదాసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ సంవాదశ్రీ పురస్కారం 2019 ప్రకటించినట్లు అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ బోపాల్ జాతీయ అధ్యక్షుడు సతీశ్ చతుర్వేది ఒక ప్రకటనలో వెల్లడించారు. గత 54 ఏండ్లుగా ప్రతి యేటా ఆయా రాష్ర్టాల్లో నిష్ణాతులైన జర్నలిస్టులకు రాష్ట్రీయ సంవాదశ్రీ పురస్కారం అందజేస్తున్నామని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆచార్య కడారి సత్యమూర్తి పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని 25న ప్రత్యేక వార్షిక దినోత్సవ సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బైస దేవదాసుకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...