సీపీజీఈటీ మొదటి దశ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి


Sun,August 25, 2019 03:34 AM

ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ - 2019 మొదటి దశ ధ్రువపత్రాల పరిశీలన శనివారంతో పూర్తయింది. 44 సబ్జెక్టులకు గాను నిర్వహించిన ఈ పరిశీలన ఈ నెల 16 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం సీపీజీఈటీ నిర్వహించిన ఓయూతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ధ్రువపత్రాల పరిశీలన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం 40,100 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, 38,900 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు తమ ధ్రువపత్రాలను పరిశీలింపజేసుకున్నారని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్. కిషన్ తెలిపారు. ఇప్పటి వరకు సంబంధిత తేదీల్లో తమ ధ్రువపత్రాలు పరిశీలించడం కుదరని పక్షంలో 26న వారు పరిశీలనకు హాజరుకావచ్చని వివరించారు. వెబ్ ఆప్షన్ల ఎంపికను మార్చుకునేందుకు 27న అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. మొదటి దశ వెబ్ బేస్‌డ్ సీట్ల కేటాయింపు 29న సాయంత్రం జరుపుతామని ప్రకటించారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...