అక్రమ సభ్యులను తొలగించాలి


Sun,August 25, 2019 03:34 AM

ఖైరతాబాద్ : నిజామ్ క్లబ్‌లో దొడ్డిదారిన వచ్చి తిష్టవేసి కూర్చున్న అక్రమ సభ్యులను వెంటనే తొలిగించాలని క్లబ్ సీనియర్, జీవిత కాలపు సభ్యుడు రమేశ్‌కుమార్ ధీర్ కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయ సలహాదారులు మహ్మద్ వాహెద్ అలీఖాన్, న్యాయవాది విజయ్ మస్కీ, రమేశ్‌బాబుతో కలిసి క్లబ్‌లో జరుగుతున్న అన్యాయాలను వివరించారు. చారిత్రక నేపథ్యంలో కలిగిన ఈ క్లబ్‌ను కొందరు అబాసుపాలు చేస్తున్నారని, ఇటీవల కాలంలో కమిటీలో అక్రమ సభ్యులను చేర్చినందుకు కోర్టును ఆశ్రయించగా కొందరు మాజీ సభ్యులపై కోర్టులో (సీసీ నెం.2600/2005) కేసులు నమోదు చేశారని తెలిపారు.చారిత్రక నేపథ్యంలో ఉన్న ఈ క్లబ్‌ను ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలని, క్లబ్ కమిటీని రద్దు చేసి నూతన కమిటీని లేబర్ కమిషనర్ లేదా, జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎన్నుకోవాలని కోరారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...