నగరంలో తగ్గుతున్న వాహన రిజిస్ట్రేషన్లు


Sun,August 25, 2019 03:33 AM

సుల్తాన్‌బజార్ : జీఎస్టీ రిటర్న్ 9,9సీలలో లోపాలు, సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని, లేని పక్షంలో వాటిని సవరణ చేసేంతవరకు గడువు పెంచాలని తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో అబిడ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్ రంగి, కార్యదర్శి రామరాజు విఠల్ మాట్లాడుతూ జీఎస్టీ వార్షిక రిటర్న్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్‌టీఆర్ 9, 9సీలను ఆగస్టు 31 లోగా దాఖలు చేయాలనే గడువును ఈ ఏడాది డిసెంబర్ 31వరకు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జీఎస్టీ ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా మొట్టమొదటి జీఎస్టీ వార్షిక రిటర్న్ 9,9సీలలో ఉన్న పెద్ద లోపాలను సవరించకుండా దాఖలు చేయడం సాధ్యం కాదన్నారు. అంతేకాకుండా మరికొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిశీలించిన అనంతరమే జీఎస్‌టీ వార్షిక రిటర్న్ దాఖలు గడువు తేదీని ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఈ మెయిల్ ద్వారా అసోసియేషన్ తరపున వినతిపత్రం పంపించామని, త్వరలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నామని చెప్పారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...