ఫిట్‌గా ఉండాల్సిందే..


Sun,August 25, 2019 03:32 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉరుకుల పరుగుల జీవితం.. నగరంలో ఎవరిని కదిలించినా బిజీ అనే మాటే. ఉపాధి వేటలో కొందరూ.. ఉద్యోగ జీవితంలో మరికొందరూ.. వ్యాపారాల్లో ఇంకొందరూ.. ఇలా ఎవరిని చూసినా.. వారి పని మీదనే ధ్యాస. ఈ క్రమంలో వారు వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. అయితే ఎంత ముఖ్యమైన బిజీ షెడ్యూల్ ఉన్నా.. రోజులో ఒక అరగంట వ్యాయామం చేయాల్సిందేనని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. ఫిట్‌గా ఉంటేనే ఏదైన చేయగలమనే మానసిక ైస్థెర్యం కలుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ప్రముఖ సాఫ్ట్‌వేర్ జెన్‌క్యూ కంపెనీ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని పాలపిట్ట సైక్లింగ్ పేత్ నుంచి వెల్‌నెస్ సైకిల్ రైడ్ ప్రారంభించింది. సుమారు 150 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. హెల్తీ నేషన్ కోసం ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించారు. 15 కిలోమీటర్ల మేర సాగిన ఈ రైడ్‌లో 60 మందికి పైగా మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెన్‌క్యూ సీఈవో మురళి మాట్లాడుతూ.. వ్యాయామం చేయడం ప్రతి ఒక్కరు బాధ్యతగా పెట్టుకోవాలని అన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...