సిటీలో 695 వైద్యశిబిరాలు..


Sun,August 25, 2019 03:32 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వర్షాకాలం నేపథ్యంలో దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబల కుండా ఉండేందుకు వైద, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. నగరంలోని 82 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 14 ఏరియా దవాఖానలు, 3 జిల్లా దవాఖానలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా దవాఖానల్లో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా తదితర విషజ్వరాల నిర్థ్ధారణకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి వ్యాధి నిర్థ్ధారణ పరీక్షలు జరపనున్నట్లు తెలిపారు. వీటితో పాటు నల్లకుంట ఫీవర్, ఉస్మానియా, గాంధీ, చిన్నపిల్లలకు సంబంధించి నిలోఫర్ దవాఖానల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు దవాఖానల సూపరింటెండెంట్లు తెలిపారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఏరియా దవాఖానల్లో ఇప్పటికే సీజనల్ వ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోగ్రామ్ ఆఫీసర్ డా.అశోక్‌కుమార్ తెలిపారు. ముఖ్యంగా దోమకాటుతో వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ సహకారంతో గ్రేటర్ వ్యాప్తంగా 695 వైద్యశిబిరాలను ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్ జిల్లాలో 250, రంగారెడ్డిలో 165, మేడ్చల్‌లో 165చొప్పున వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...