లీకేజీకి మరమ్మతులు.. పలుప్రాంతాల్లో నీటి సరఫరా బంద్


Sun,August 25, 2019 03:31 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరానికి కృష్ణానది నుంచి మంచినీటినందించే కృష్ణా ఫేజ్ -1 పైపులైనుకు బండ్లగూడ వద్ద భారీ లీకేజీ ఏర్పడటంతో ఈ నెల 28,29 తేదీల్లో పలు ప్రాంతాలకు 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. బండ్లగూడ వద్ద 2200 ఎంఎం పైపులైన్‌కు భారీ లీకేజీ ఏర్పడటంతో మరమ్మతులు చేయాల్సి ఉందని తెలిపారు. 28న ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆయన వెల్లడించారు. దీని ప్రభావంతో ఆలియాబాద్, మిరాలం, కిషన్‌బాగ్, రియాసత్‌నగర్, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మాన్‌ఘడ్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట, ముసారాంబాగ్, బొగ్గులకుంట, అప్జల్‌గంజ్, హిందీనగర్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం, చిలకలగూడ, దిల్‌సుక్‌నగర్ ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు.

విద్యుత్ సరఫరాలో..
ఇక కృష్ణా ఫేజ్ -2,3లకు సంబంధించి 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడతున్నందున 29న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొన్ని ప్రాంతాలకు భోజగుట్ట, మారేడ్‌పల్లి, సైనిక్‌పురి ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఎండీ వెల్లడించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...