పదేండ్ల బాలుడు.. రూ. 15వేల వితరణ


Sun,August 25, 2019 03:30 AM

తల్లిదండ్రులు తనకిచ్చిన పాకెట్ మనీని పొదుపు చేసి పరోపకారానికి వినియోగించి పదేండ్ల బాలుడు పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మాసబ్‌ట్యాంక్ మజీదియా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సాయి అన్షు అనే బాలుడు తన పుట్టిన రోజు సందర్భంగా రూ.15 వేలు వితరణ చేసి శభాష్ అనిపించాడు. నగరానికి చెందిన గౌరి అనిల్‌ల కుమారుడు అన్షు శనివారం పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం శారదకు రూ.10 వేల చెక్‌తో పాటు రూ.5 వేల విలువైన స్టేషనరీని విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలో 40 మంది పదో తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు, 150 మంది విద్యార్థులకు స్టేషనరీ పౌచ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలుడి తాత శ్రీనివాస్ దంపతులు, గౌరి అనిల్, సుమలతో పాటు ఉపాధ్యాయులు మాధవి , అపర్ణ , రేణుక , పద్మావతి, విజయ నిర్మల తదితరులు ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...