నగ్న చిత్రాల సేకరణ


Sat,August 24, 2019 03:03 AM

చందానగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మొదట ఉద్యోగం ఇస్తానంటూ నమ్మించి మహిళల నగ్న చిత్రాలు సేకరిస్తాడు.. వాటిని చూపించి తన లైంగిక కోరిక తిర్చమని, అదేవిధంగా తనకు కావలసినంత డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తాడు. అప్పటికే మోసపోయిన మహిళలు ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక లొంగిపోక తప్పని పరిస్థితి. ఈ విధంగా 16 రాష్ర్టాలకు చెందిన దాదాపు 600 మంది మహిళల నగ్న చిత్రాలను సేకరించిన దుండగుడు ఇప్పటికే దాదాపు 200 మందిని హింసించాడు. ఎట్టకేలకు మియాపూర్‌కు చెందిన ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు చెన్నైలో ఉండే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ సామల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రం తిరువొత్తియూర్ ప్రాంతానికి చెందిన క్లెమెంట్ రాజ్ చెజియాన్ అలియాస్ ప్రదీప్ చెన్నైలోని ఎన్‌ఎమ్‌సీ బ్యాంక్‌లో నివాసముంటూ టీసీఎస్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రదీప్ భార్య సైతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ప్రదీప్ రాత్రి షిఫ్టులు చేస్తూండగా అతడి భార్య పగలు షిఫ్టులో పనిచేస్తుంది.

దీంతో వెబ్‌సైట్‌లో క్విక్కర్ డాట్ కాం నుంచి ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం అభ్యర్థన పెట్టుకున్న మహిళల ఫోన్ నంబర్లు సేకరిస్తాడు. సేకరించిన నంబర్‌లకు తనయొక్క ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి తన పేరు ప్రదీప్ అని, ర్యాడిసన్ హోటల్‌లో రిక్రూట్‌మెంట్ స్టాఫ్‌నని పరిచయం చేసుకుంటాడు. అనంతరం హెచ్‌ఆర్ మేనేజర్ అర్చన జగదీశ్ అనే వాట్సాప్‌లోనే ఇంటర్వ్యూ తీసుకుంటుందని నమ్మిస్తాడు. వెంటనే తానే అర్చన జగదీశ్ అని సదరు మహిళలతో వాట్సాప్‌లోనే ఇంటర్వ్యూ తీసుకుంటాడు. వారి సాధారణ ఫొటోలను సేకరించిన తర్వాత మీరు మొదటి రౌండ్‌లో సెలెక్ట్ అయ్యారని సంతోష పరుస్తాడు.


సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ మొదలు పెట్టి తమలాంటి స్టార్ హోటల్ భారీ పారితోషకంతో కూడిన ఉద్యోగం రావాలంటే శరీర సౌష్టవం అందంగా ఉండాలని, అందుకోసం వారి ముందు, వెనుక శరీర నగ్న చిత్రాలను పంపించమని అడుగుతాడు. దీంతో అతడు చెప్పినట్లు పంపిన చిత్రాలను తన ఫోన్ గ్యాలరీలో స్టోర్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన ఫోన్ నుంచి ఆ నగ్న చిత్రాలను వారికి పంపి అదే ఫోన్ నుంచి వీడియో కాల్ చేస్తాడు. ఆమె నగ్న చిత్రాలు తన వద్ద ఉన్నాయని, ఒంటిపై దుస్తులు తొలగించి వీడియో కాల్ మాట్లాడాలని వార్నింగ్ ఇస్తాడు. అలా మాట్లాడుతుండగా ఆ నగ్న దృశ్యాలను సైతం వీడియో రికార్డింగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఈ రకంగానే మియాపూర్‌కు చెందిన ఓ మహిళ తన ఫోన్ నుంచి ఫిర్యాదు చేయగా ఆమెను అందరిలాగే వేధించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె ధైర్యంగా మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసుల ప్రత్యేక బృందం చెన్నైకి వెళ్లి నిందింతుడు క్లెమెంట్ రాజ్ చెజియాన్ అలియాస్ ప్రదీప్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ఒక ఫోన్ రెండు సిమ్‌లు, వ్యాట్సాప్ చాట్, ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ మాట్లాడుతూ మహిళలు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్‌నంబర్లు, పర్సనల్ ఫొటోలు షేర్ చేయవద్దని, ఇలాంటి వారిపై అనుమానం వచ్చిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమందించాలాని సూచించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...