రూ. 12 లక్షలతో ఉడాయించిన ఘరానా మోసగాళ్లు అరెస్టు


Sat,August 24, 2019 03:03 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పాత కరెన్సీలో 2002 సిరీస్ ఉన్న నోట్‌కు మంచి గిరాకీ ఉందంటూ ఓ పెట్రోల్ బంకు వ్యాపారిని నమ్మించి, అతడి దృష్టి మళ్లించి రూ. 12 లక్షలు అపహరించిన ఒక ముఠాను సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 48 గంటల్లో పోయిన సొత్తును రికవరీ చేసి, నిందితులను పట్టుకున్నామని సీపీ వెల్లడించారు. సీపీ అంజనీకుమార్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరించారు. వృత్తిరీత్యా వ్యాపారి చంద్రాయణగుట్ట అబీద్ మెహిద్దీన్ అలియాస్ అబెద్, భవానీనగర్‌కు చెందిన వాటర్ బాటిల్ కంపెనీలో బిజినెస్ డెవెలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేసే షేక్ అబ్దుల్ బాసిత్ అలియాస్ బాసిత్ స్నేహితులు. కోఠి, పుత్లిబౌలోపెట్రోల్ బంక్‌లో పనిచేసే వరంగల్ జిల్లాకు చెందిన సంబరం రాజేశ్‌కు ఆ ఇద్దరి స్నేహితులతో పరిచయమైంది. పాత కరెన్సీలో 2002 సీరిస్ ఉన్న నోట్లకు ఒక్కొదానికి కే. 50000 వేల ధర పలుకుతుందంటా అంటూ పెట్రోల్‌బంక్‌లో పనిచేసే రాజేశ్, తన బంక్ యజమానితో చర్చించాడు. అయితే ఎలా దొరుకుతాయని యజమాని ప్రశ్నించడంతో అబీద్, బాసిత్‌లను రాజేశ్ తన యజమానికి పరిచయం చేశాడు.

తమకు తెలిసిన ఒక వ్యక్తి వద్ద రూ. 2 కోట్ల పాత నోట్లు ఉన్నాయని, వాటిని మనకు ఇవ్వాలంటే రూ. 12 లక్షల కొత్త కరెన్సీ అడుతున్నారంటూ పెట్రోల్ బంక్ యజమానికి సూచించారు, దీంతో ఆయన ఆ డబ్బును మరుసటి రోజు సర్దుబాటు చేశాడు. డబ్బు తీసుకొని సైబరాబాద్‌లోని ఎస్‌బీహెచ్ కాలనీకి వెళ్లిన పెట్రోల్ బంక్ యజమానిని ఒక గుర్తుతెలియని ఇంటి వద్దకు తీసికెళ్లారు. ముందుగా సదరు వ్యక్తి డబ్బు చూపించుమంటున్నాడని, నేను వెళ్లి రూ. 12 లక్షలు చూపించి వస్తానంటూ అబేద్ నగదుతో ఉన్న బ్యాగ్ తీసుకొని బైక్‌పై పరారయ్యాడు, తరువాత మిగతా నిందితుడు కూడా అక్కడి నుంచి పరారై, డబ్బును పంచుకున్నారు. బాధితుడు సైదాబాద్ పోలీసులకు రెండు రోజుల తరువాత వచ్చి జరిగిన విషయంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందతులను పట్టుకొని వారి వద్ద నుంచి రూ. 12 లక్షలు రికవరీ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ రమేష్‌రెడ్డి, ఏసీపీ సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...