ఈ నెల 27 నుంచి స్పోర్ట్స్ మీట్


Sat,August 24, 2019 03:02 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్ జిల్లా అంతర్ పాఠశాలల, కళాశాల క్రికెట్, చెస్, బ్యాడ్మింటన్, కబడ్డీ స్పోర్ట్స్ మీట్ బ్రోచర్ ను శుక్రవారం డెక్కన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు సయ్యద్ సోహైల్, మహ్మద్ పజిలాత్ అహ్మద్, మహ్మద్ విక్వా ర్ అహ్మద్‌లు ఆవిష్కరించారు. డెక్కన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఖులీ ఖుతుబ్‌షా స్టేడియంలో స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నారు. ఈ చాంపియన్‌షిఫ్‌లో అండర్-14, 17, 19 బాలబాలికల జట్టు పాల్గొన వచ్చు. ఆసక్తిగల క్రీడాకారులు ఆథార్ కార్డు, ఒక ఫోటోతో నమోదు చేసు కోవాలి హైదరాబాద్ జిల్లా చదువుతున్న విద్యార్థులు పాల్గొనడానికి అర్హు లు. ఈ నెల 26 లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలి. వివరాలకు మహ్మ ద్ విక్వార్ అహ్మద్ 9182892936, 9581575132 సంప్రదించాలి.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...