నేడు లాఫ్ ఆర్ డై, డ్రిఫ్టర్స్ సినిమాల ప్రదర్శన


Sat,August 24, 2019 03:00 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: యూరప్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సారథి స్టూడియోలో ప్రతి రోజు రెండు ఆటలు ప్రదర్శిస్తున్నారు. ఉచితంగా సినిమాలను వీక్షించే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ప్రతి రోజు సాయంత్రం 6గంటలకు, రాత్రి 8 గంటలకు సినిమాలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, తెలంగాణ టూరిజం శాఖ, యూరోపియన్ ఎంబసీ, భారత సమాచార మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. శుక్రవారం లిటిల్ ఇంగ్లండ్, బిసైడ్ మీ సినిమాలను ప్రదర్శించారు. శనివారం లాఫ్ ఆర్ డై, డ్రిఫ్టర్స్ సినిమాలు ప్రదర్శనకు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అయితే వీకెండ్ కావడంతో ఎక్కువగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని, ఆసక్తి ఉన్న వాళ్లు సాయంత్రం 3 గంటల వరకు స్టూడియోకు చేరుకోవాలని సూచించారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...