తగ్గుతున్న ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్


Sat,August 24, 2019 02:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గతంతో పోల్చితే వాహనాలకు రవాణాశాఖ అందించే ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ తగ్గుతున్నది. దానికి ఉదాహరణే శుక్రవారం జరిగిన వేలంలో అత్యంత డిమాండ్ ఉండే 9999 నంబరు కేవలం రూ.5.5 లక్షలకు మాత్రమే శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతంలో ఈ నంబరు 10 లక్షల రూపాయలు దాటిన సందర్భాలున్నాయి. గత మూడు సీరిస్‌లలో కూడా పెద్దగా వేలంలో అమ్ముడు పోలేదు. ఇక ఆ తర్వాత డిమాండ్ ఉన్న 0099, 0009, 6666, 6999, నంబర్లు కూడా మామూలు మొత్తానికే వేలంలో వెళ్లిపోతున్నాయి. 9999 తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న 0009 నంబరు వేలానికే రావడం లేదు. కేవలం సింగిల్ బిడ్డర్ మాత్రమే పాల్గొని దక్కించుకుంటున్నారు. గతంలో మామూలు నంబర్లకు కూడా క్రేజీ ఉండేది. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం వల్ల వాహనాల కోసం నంబర్లను ఎక్కువకు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవచ్చని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ధర పలికే టీఎస్ 09 (ఖైరతాబాద్ ఆర్‌టీవో)సీరిస్ ఫ్యాన్సీ నంబర్లు ప్రస్తుతం ఢీలా పడిపోతున్నాయి.

కొన్ని నంబర్లు 4545, 777, 3333, 4444, 5555, 8888, 1, 999 నంబర్లకు కనీసం వేలంలో కూడా రావడం లేదు. అసలు పోటీ లేకుండానే నంబర్లు దక్కించుకుంటున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ కార్యాలయంలో టీఎస్ 09 ఎఫ్‌జీ సీరీస్‌కు సంబంధించిన నంబర్లలో కేవలం 18,15,000 ఆదాయం వచ్చినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. అందులో రూ.94,35,670 విలువగల మెర్సిడేస్ జీఎల్‌ఎస్ 350డీ 4 మాటిక్ కారు కోసం శ్రీకాంత్‌రెడ్డి 5,50,000 చెల్లించి 9999 నంబరును దక్కించుకున్నాడు. అదేవిధంగా ఆర్‌ఎస్ బ్రదర్స్ సంస్థ 1,37,94,000 విలువైన తమ మెర్సిడేస్ బెంజ్ 350 డీఎల్ కోసం రూ.3,36,000 చెల్లించి 0099 నంబరును దక్కించుకున్నారు. 45,64,800 విలువైన మెర్సిడేస్ బెంజ్ సీ 20 మోడల్ కోసం 1,10,000 చెల్లించి జీఎస్ కన్‌స్ట్రక్షన్ సంస్థ 0005 నంబరును దక్కించుకుంది.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...