స్పోర్ట్స్ ఎక్స్‌పో ఇండియా ప్రారంభం


Sat,August 24, 2019 02:58 AM
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పాతనగరంలో మరింత మెరుగైన నీటి సరఫరా లక్ష్యంగా జలమండలి ప్రణాళికలు సిద్ధం చేసింది. పురాతన మంచినీటి పైపులైన్ వ్యవస్థతో కలుషిత నీటి సరఫరా సమస్య అధికమవుతున్న దృష్ట్యా నూతనంగా పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎండీ దానకిశోర్ నిర్ణయించారు. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఎస్ కన్సల్టెన్సీ అధ్యయనం చేసి ఇటీవల జలమండలికి రూ.540కోట్ల అంచనాతో డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సమర్పించింది. 610 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ మెయిన్ పైపులైన్ వ్యవస్థతో పాటు 21 చోట్ల 54.30 ఎంఎల్ సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న 6.91 ఎంఎల్ సామర్థ్యం గల రిజర్వాయర్లను పునరుద్ధరించాలని నివేదిక ఇచ్చారు. రిజర్వాయర్లు, ఇన్‌లెట్, ఔట్‌లెట్, డిస్ట్రిబ్యూషన్ మెయిన్స్ సమూలంగా కొత్తగా ఏర్పాటు చేసి కలుషిత నీటి సరఫరా లేకుండా మెరుగైన నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణపై స్పష్టత వచ్చిన వెంటనే అధికారులు టెండర్లు పిలిచి పనులను చేపట్టనున్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...