స్పోర్ట్స్ ఎక్స్‌పో ఇండియా ప్రారంభం


Sat,August 24, 2019 02:57 AM

మాదాపూర్ : ఆరోగ్యకరమైన జీవనానికి వ్యాయామం ఎంతో అవసరమని, ఫిట్‌నెస్ అనేది కేవలం శరీర దారుడ్యం కొరకే కాదని ఫిట్‌గా ఉండటం వల్ల శరీరం ఎల్లవేలలా ఆరోగ్యంగా ఉంటుందని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ ఎండీ ముషర్రఫ్ అలీ ఫరూకీ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ఎక్స్‌పో ఇండియా 2019 కార్యక్రమానికి నిర్వాహకులు, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు మురళి నన్నప్పనేనిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా హైటెక్స్‌లో ఆదివారం నిర్వహించనున్న మారథాన్‌లో పదివేలకు పైగా వ్యాయామ ప్రేమికులు విచ్చేయనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో జిమ్ ఐటెమ్స్, ప్రోటీన్ ఫుడ్, స్పోర్ట్స్‌కు చెందిన ఉత్పాదనలు కొలువుదీరాయి.

ఎక్స్‌పోలో భాగంగా ఎయిర్‌టెల్ మారథాన్
ఎక్స్‌పోలో భాగంగా ఎయిర్‌టెల్ హైదరాబాద్ నిర్వహించనున్న మారథాన్‌లో రెండు రోజుల్లో దాదాపు 27 వేల మందికి పైగా పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇం దులో మొత్తం నాలుగు కేటగిరీలను ఎంపిక చేసి 5కె, 21కె, 42కె మారథాన్‌లను ఏర్పా టు చేయనున్నారు. నేడు హైటెక్‌సిటీ నుండి గచ్చిబౌలి వరకు జరగనున్న మారథాన్ 21 కిలో మీటర్ల మేర 9వేల మంది పాల్గొననున్నారని ఆదివారం నెక్లెస్ రోడ్డు నుండి గచ్చిబౌలి స్టేడియం వరకు జరగనున్న ఫుల్ మారథాన్ 42 కిలో మీటర్లు 1500 మంది, హైటెక్‌సిటీ నుండి గచ్చిబౌలి వరకు నిర్వహించనున్న 10 కె మారథాన్‌లో 10 వేల మంది పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు నిర్వహించనున్న హైదరా బాద్ రన్నర్స్ మర్తాన్ రన్ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుంచి 9 గంటల వరకు హుస్సేన్‌సాగర్ చుట్టు పక్కలతో పాటు రన్ జరిగే రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...