ప్రతి శుక్రవారం..హరితహారం


Fri,August 23, 2019 04:45 AM

-బల్దియా సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలి
-ఒక్కొక్కరు పది మొక్కలు నాటాలి
-త్వరలోనే మరో 1500 స్వచ్ఛ ఆటోలు
-అన్నపూర్ణ కేంద్రాల ఆధునీకరణ
-కార్మికుడు మరణిస్తే రూ.23లక్షల పరిహారం
-స్వచ్ఛతలో ప్రథమస్థానంలో నిలుద్దాం
-విస్తృతస్థాయి సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్

మేయర్ అధ్యక్షతన సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో గురువారం స్వచ్ఛసర్వేక్షణ్, ఓడీఎఫ్++, సాఫ్ హైదరాబాద్ షాన్‌దార్ హైదరాబాద్, రోడ్ల మరమ్మతులు, గణేష్ నిమజ్జన ఏర్పాట్లు, హరితహారం, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మా ట్లాడుతూ, నగరాన్ని దశలవారీగా ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు, ఇందులో భాగంగా ఇప్పటికే 50మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్‌ను నిషేధించామన్నారు. ప్లాస్టిక్ వినియోగిస్తే పెద్ద ఎత్తున జరిమానాలు విధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా స్వచ్ఛ నిబంధనలను ఉల్లంఘించేవారికి సైతం భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు, రానున్న రోజుల్లో నిబంధనలను ఉల్లంఘించాలంటే భయపడే విధంగా నిబంధన ల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్య కార్మికుడు మరణిస్తే రూ.23లక్షల వరకు పరిహారాన్ని అందించే బీమా సౌకర్యాన్ని జీహెచ్‌ఎంసీ కార్మికులకు కల్పించనున్నట్లు వెల్లడించారు. 25 కిలోలకన్నా ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తిచేసేవారిని బల్క్ గార్బేజ్ ప్రొడ్యూసర్లుగా గుర్తించనున్న ట్లు, పదినుంచి 20శాతం స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రస్తుతమున్న రెండున్నర వేల స్వచ్ఛ ఆటోలకు అదనంగా నాలుగు టన్నుల సామర్థ్యం గల 1500 స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రెసిడెన్షియల్ జోన్‌లోని 100 రోడ్లను కమర్షియల్ రోడ్లుగా త్వరలోనే ప్రకటి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనున్నట్లు చెప్పారు. రూ. ఐదుకే భోజనాన్ని అందించే అన్నపూర్ణ కేంద్రాలను మరింత ఆధునీకరించనున్న ట్లు మేయర్ వివరించారు. కమిషనర్ దానకిశోర్‌తోపాటు వివిధ విభాగాల అధికారులు, జోన ల్, డిప్యూటీ కమిషనర్లు, కిందిస్థాయి సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.


శుక్రవారాన్ని హరితహారంగా పాటించాలి
-ప్రతి శుక్రవారాన్ని హరితహారం దినంగా పాటించాలి. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. ఈ శుక్రవారం నుంచే పెద్ద ఎత్తున ప్రారంభించాలి. అన్ని శాఖలు తప్పనిసరిగా పాల్గొనాలి.
-ప్రతి శుక్రవారం స్వచ్ఛ ఆటోలతోపాటు ఎంటమాలజి, అర్బన్ బయోడైవర్శిటీ తదితర విభాగాలకు చెందిన మినీ టిప్పర్లను మొక్కల పంపిణీ కోసం ఉపయోగించాలి.
-ఈ వారం నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో వార్డుకు 50వేల చొప్పున మొక్కలు నాటడం/పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
-అన్ని ఏరియా కమిటీలు, వార్డు కమిటీలు, ఏరియా సబ్ మెంబర్లు మొక్కల పంపిణీలో తప్పనిసరిగా పాల్గొనాలి.
-ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వీఐపీలు, క్రీడ, సినిమా రంగాలకు చెం దిన ప్రముఖులు, బల్దియాకు చెందిన ఆయా విభాగాల హెచ్‌ఓడీలు తప్పనిసరిగా వారివారి ప్రాంతాల్లో జరిగే హరితహారం కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.
-రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కమ్యునిటీ ఆర్గనైజర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమంలో పాల్గొనాలి.
-హరితహారం కార్యక్రమాల వద్ద ప్లాస్టిక్ ఫ్రీపై చైతన్యం కలిగించే బ్యానర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అలాగే, జియోట్యాగింగ్
చేయడంతోపాటు రోజూ ఆప్‌డేట్ చేయాలి.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...