అక్రమ నల్లా కనెక్షన్ ఉన్న ముగ్గురిపై క్రిమినల్ కేసు


Fri,August 23, 2019 04:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలి సరఫరా చేస్తున్న పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన ముగ్గురు వ్యక్తులపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఓల్డ్‌అల్వాల్ పరిధిలోని ఓమ్‌శ్రీసాయి నగర్‌లోని ఇంటి నంబర్లు 1-5-908, 1-5-846, 1-5-848, అలాగే మరో భవన ఇంటి నంబర్ 1-5-852 భవనాలకు అధికారుల అనుమతి లేకుండా సదరు భవన యజమానులు 15 ఎంఎం అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఎండీ దానకిశోర్ ఆదేశాల మేరకు ఆయా అక్రమ నల్లాలను తొలిగించడంతోపాటు భవన యజమానులు గోవర్దన్, ఎండీ మురీద్, జె.సుశీలతోపాటు మరో వ్యక్తిపై అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో యూ/ఎస్ 269, 430, 370ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. జలమండలి అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 నంబర్లలో సమాచారం అందించాలన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...