పోలీసుల అదుపులో పార్సిళ్ల నిందితుడు


Fri,August 23, 2019 04:37 AM

సిటీబ్యూరో/బేగంపేట్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌తో పాటు ప్రముఖులకు పార్సిళ్లు పంపడానికి ప్రయత్నించిన కేసు మిస్టరీని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించినట్లు తెలిసింది. ఉద్దేశపూర్వకంగానే ఈ పార్సిళ్లను సికింద్రాబాద్ కుమ్మరిగూడ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావుగా పంపినట్లు తేలింది. వెంకటేశ్వరరావు పాల సరఫరాకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. బుధవారం యూరియా కలిపిన 62 బాటిళ్లను ప్రముఖులకు పంపించేందుకు సికింద్రాబాద్ పోస్టాఫీసు కార్యాలయానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పోస్టాఫీసు సిబ్బంది అనుమానంతో ఈ వ్యవహారంపై మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు లభించిన ఆధారాలతో వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.

మతిస్థిమితం సరిగాలేక వెంకటేశ్వరరావు ఇలా చేశాడని ప్రచారం జరిగినప్పటికీ ప్రాథమిక విచారణలో మాత్రం అతను ఉద్దేశపూర్వకంగానే యూరియా కలిపిన నీటిని పంపి అలజడి సృష్టించాలని యత్నించినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీంట్లో భాగంగా వెంకటేశ్వరరావుకు ఇలా పంపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది. అతని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అంశంపై దర్యాప్తును ముమ్మరం చేశారు. అదే విధంగా అతను చెల్లించిన పోస్టల్ ఫీజు నగదు 7,100పై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం వెంకటేశ్వరరావు పోలీసుల అదుపులో ఉన్నాడు. శుక్రవారం అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈ 62 బాటిళ్లకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందినట్లు సమాచారం.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...