అనుమానాస్పదస్థితిలో గుర్తు తెలియని మహిళ..


Fri,August 23, 2019 04:36 AM

కాచిగూడ : అనుమానాస్పదస్థితిలో ఫుట్‌పాత్‌పై ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఎన్.ధర్మ తెలిపిన ప్రకారం.. గుర్తుతెలియని మహిళ(55)నల్లకుంట డివిజన్ తిలక్‌నగర్‌లోని ఇందిరానగర్ ప్రాంతంలోని జైభవానీ అసోసియేషన్ కార్యాలయం ఫుట్‌పాత్‌పై గురువారం అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపర్చుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలు తెలుపు రంగు చీరపై నీలి రంగు చుక్కలు, నీలిరంగు డార్క్ జాకెట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు 7901102225, 040-27854778లో సంప్రదించాలని కోరారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...