పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్‌మేళా


Fri,August 23, 2019 04:35 AM

కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ: శాంతి భద్రతల పరిరక్షణే కాదు.. ప్రతిభావంతులైన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో నగర పోలీసులు ముం దంజలో ఉన్నారు. ఇప్పటికే 30కిపైగా జాబ్‌మేళాలను నిర్వహించి వేలాదిమం ది నిరుద్యోగ యువతకు ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలను కల్పించిన నగర పోలీస్ విభాగం మరో మెగా జాబ్‌మేళా నిర్వహణకు సిద్ధమవుతోంది. సీపీ అంజనీకుమార్ సారధ్యంలో పోలీస్‌శా ఖ, టీఎంఐ గ్రూపుల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ ఫ్యాట్నీసెంటర్‌లోని శ్రీ వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఐటీ) ప్రాంగణం లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ముఖ్యఅతిథిగా, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగనవర్ అతిథులుగా హాజరై జాబ్‌మేళాను ప్రారంభించనున్నారు. జాబ్‌మేళాలో 80కిపైగా ప్రైవేటు కంపెనీలు పాల్గొననున్నట్లు జాబ్‌మేళా నిర్వాహకులు, కార్ఖానా ఇన్‌స్పెక్టర్ మ ధుకర్‌స్వామి వెల్లడించారు.

దాదాపు ఈ జాబ్‌మేళా ద్వారా 800లకుపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. జాబ్‌మేళాలో పాల్గొన నున్న నిరుద్యోగుల నుంచి ఏ విధమైన ఫీజులుగానీ, మరేవిధమైన సర్వీసు చార్జీ లు గానీ వసూలు చేయమన్నారు. కేవ లం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు మూడేళ్లుగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామన్నారు. మూడేళ్లుగా ప్రతి సం వత్సరం వివిధ ప్రాంతాల్లో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుండగా, ఈనెల 24న జరిగే జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్ఖానా ఇన్‌స్పెక్టర్ మధుకర్‌స్వామి తెలిపారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...