లక్డీకాపూల్ నమూనా వంతెన ప్రారంభం


Fri,August 23, 2019 04:35 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జంక్షన్ల సుందరీకరణలో భాగంగా లక్డీకాపూల్ జంక్షన్‌లో జీహెచ్‌ఎంసీ నిర్మించిన కర్రల వంతెన నమూనాను గురువారం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. చారిత్రక నేపధ్యాన్ని గుర్తుకు తెచ్చే విధంగా నిర్మించిన ఈ నమూనా పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది. దీన్ని రూ. 30లక్షలతో నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కర్రతో రూపొందించిన వంతెన నమూనా నగరానికి సరికొత్త ఆకర్షణగా ఉందని పేర్కొన్నారు. లక్డీకాపూల్ చరిత్రను గుర్తుకు తెచ్చే విధంగా థీమ్‌ను ఎంచుకోవడం ఎంతో సముచితమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, బల్దియా స్థాయీసంఘం సభ్యులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...