బీఎస్.రాములు రచనలతో బలహీనవర్గాల్లో చైతన్యం


Fri,August 23, 2019 04:33 AM

రవీంద్రభారతి: వెనుకబడిన వర్గాల్లో తన రచనలతో చైతన్యం కలిగించిన సాహితీశిఖరం, బహుజన సిద్ధాంతకర్త బిఎస్.రాములు అని వక్తలు కొనియాడారు. రవీంద్రభారతిలో విశాల సాహిత్య అకాడమీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్, భాషాసాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 5 రోజులపాటు నిర్వహిస్తున్న బి.ఎస్.రాములు 70వ జన్మదిన సప్తతి సందర్భంగా నాలుగోరోజు బి.ఎస్.రాములు సాహిత్య సమాలోచన సదస్సు నిర్వహించారు. బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌తో పాటు సభ్యులు జూలూరి గౌరీశంకర్, డా.ఆంజనేయ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొని బి.ఎస్.రాములు సాహితీ, సామాజిక వ్యక్తిత్వాన్ని ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాములు రచించిన జీవనయానం, బతుకుపోరు, అడవిలో వెన్నెల, చికాగో నాన మ్మ, ఇల్లు-వాకిలి, గెలుచుకున్న జీవితం తదితర నవలలను విశ్లేషిస్తూ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాములు రచించిన ఒక సృష్టికర్త ఆత్మ చింతన, ప్రేమంటే ఏమిటితోపాటు ఆచార్య నీరజ రచించిన వాట్సాప్, మారోజు దేవేంద్ర రచించిన అడుగులు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం బి.ఎస్.రాములును పలువురు సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు ఘనంగా సత్కరించారు. ఆచార్య రఘు, ఎం.రామలక్ష్మి, డా.కర్రె సదాశివ, డా.మొగిలి మోహనరావు, నందిగామ నిర్మల, యాకమ్మ, డా.ఎం.దేవేంద్ర, డా.పత్తిపాక మోహన్, పత్రికా సంపాదకులు బైస దేవదాస్, సంగెం సూర్యారావు, డా.రాజేంద్రసింగ్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...