ఇంజినీర్లు మరింత కష్టపడి పనిచేయాలి జలమండలి ఎండీ దానకిశోర్


Thu,August 22, 2019 03:32 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రారంభ సమావేశం బుధవారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దానకిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాటర్‌బోర్డు పేరు ప్రఖ్యాతలు ఇంకా పెరుగాలంటే అందరూ మరింత కష్టపడి పనిచేయాలని ఎండీ సూచించారు. హడ్కో, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులు రికార్డ్ సమయంలో పూర్తి చేయడంలో ఇంజినీర్ల పాత్ర ప్రముఖమైనదని కొనియాడారు. నగరంలో వృథాగా పోతున్న 170 ఎంజీడీల నీటిలో 20 ఎంజీడీల నీరు వృథాను అరికట్టాలని తెలిపారు. సంస్థ నెలవారీ రెవెన్యూ పెంచేందుకు ఇంజినీర్లు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జలమండలి ఇంజినీర్ల అసోసియేషన్ ఎండీని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. అపరిష్కృతంగా ఉన్న ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించాలని ఎండీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, డి.శ్రీధర్‌బాబు, వీఎల్ ప్రవీణ్‌కుమార్, జలమండలి ఇంజినీర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రాజశేఖర్, జనరల్ సెక్రటరీ ఎస్.హరిశంకర్‌లతోపాటు పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...