కొత్త ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన


Thu,August 22, 2019 03:31 AM

బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ : కొత్త మోటార్ వెహికిల్ యాక్ట్-2019పై అవగాహన కల్పించేందుకు ప్రధాన రోడ్లు, కూడళ్ల వద్ద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలను పాటించండి -డబ్బులు పొదుపు చేయండి అం టూ ఫ్లెక్సీల ద్వారా వాహనదారులను కోరుతున్నారు. నగరంలోని అన్ని ప్రధాన రోడ్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని ఫ్లెక్సీల ద్వారా గుర్తు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించేవారిని ప్రోత్సహిస్తూ ఇటీవల బహుమతులు ఇస్తున్నామని, అదే సమయంలో ఉల్లంఘనలకు పాల్పడేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని తెలియజేసేందుకే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. జరిమానాలు తప్పించుకోవడం ద్వారా డబ్బులను పొదుపు చేసినట్లే అని వివరిస్తూ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలద్వారా వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉంటారని భావిస్తున్నామని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తు తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...