తక్షణమే ఆర్‌యూబీ పనులు ప్రారంభించాలి


Thu,August 22, 2019 03:31 AM

మల్కాజిగిరి, నమస్తే తెలంగాణ : మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ ఆర్‌యూబీ పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ అధికారులకు ఆదేశించారు. బుధవారం అధికారులతో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా వాహనాలు రావడానికి వీలుగా బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని వివరించారు. వాటర్‌వర్క్స్, విద్యుత్ లైన్లను షిఫ్ట్ చేయాలని అధికారులకు సూచించారు. బ్రిడ్జి పనులు పూర్తయిన అనంతరం సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, కోర్టులో కేసు ఉన్నందున పనుల్లో ఆలస్యం జరుగుతుందని అధికారులు కమిషనర్‌కు వివరించారు.

అనంతరం సఫిల్‌గూడ మినీట్యాంక్‌బండ్‌ను సందర్శించి వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. సఫిల్‌గూడలో జరుగుతున్న ప్యాచ్‌వర్క్ పనులను పరిశీలించి నాణ్యతతో మరమ్మతులు చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, మల్కాజిగిరి ఆర్డీవో మధుసూదన్, సర్కిల్ ఈఈ అనిల్‌రాజ్, సిటీ ప్లానర్ ప్రసాద్‌రావు, తహసీల్దార్ గీతా, జలమండలి, వాటర్‌వర్క్స్, విద్యుత్ అధికారులు కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, గుండా నిరంజన్, జీఎన్‌వీ. సతీశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...