పాత నేరస్తుడు పట్టుబడ్డాడు...


Thu,August 22, 2019 03:26 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రెండు సార్లు పీడీయాక్ట్ ప్రయోగించినా... బుద్ధి మార్చుకోకుండా తిరిగి స్నాచింగ్‌లు, దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ హసన్‌నగర్‌లో నివాసముండే మహ్మద్ ఫైజల్ 7వ తరగతి వరకు చదివాడు. చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు బానిసై నేరాల బాట పట్టాడు. 2013 నుంచి మొత్తం 18 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇందులో స్నాచింగ్‌లు 14, దొంగతనాలు రెండు, ఒక హత్య, మరో దోపిడీ కేసు లో నిందితుడిగా ఉన్నాడు. 2015లో ఒకసారి, 2017లో మరోసారి ఇతనిపై పీడీయాక్ట్ ప్రయోగించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తాజాగా అబూద్ బిన్ హజీతో కలిసి స్నాచింగ్‌లు, సెల్‌ఫోన్ల దోపిడీ, దొంగతనాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ , బోయిన్‌పల్లి పోలీసులకు నిందితుడు ఓల్డ్ ఎయిర్‌పోర్టు వద్ద టాటా ఇండికా( టీఎస్10యుఏ9774 )లో వెళ్తూ పట్టుబడ్డాడు. మరో నిందితుడు హజీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...