అనారోగ్యంతో శిశువిహార్ బాలుడు మృతి


Wed,August 21, 2019 03:34 AM

వెంగళరావునగర్: వెంగళరావునగర్ డివిజన్.. స్టేట్‌హోం ఆవరణలో ఉన్న శిశువిహార్‌లో 17 రోజుల వయస్సున్న ఆదర్శ్ అనే బాలుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సార్ నగర్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ కథ నం ప్రకారం...కామెర్లు(జాండీస్)తో బాధపడుతున్న ఆదర్శ్‌ను ఈ నెల 11న శిశువిహార్ సిబ్బంది నిలోఫర్ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో 17న పంజాగుట్టలోని లిటిల్‌స్టార్ దవాఖానలో చేర్పించి చికిత్స అందించా రు. అక్కడ చికిత్స పొందుతూ ఆదర్శ్ అదే రోజు రాత్రి మృతి చెందాడు. దీంతో శిశువిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త వి.రామారావు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్‌లోని ఐసీడీఎస్ అధికారులు ఈ నెల 7న 7 రోజుల వయసున్న ఆదర్శ్‌ను స్టేట్‌హోం ఆవరణలో ఉన్న శిశువిహార్‌లో చేర్పించారు. షాద్‌నగర్‌లో ఓ బాలికపై లైంగికదాడి జరగడంతో ఆమె గర్భం దాల్చి మగబిడ్డను ప్రసవించినట్లు తె లుస్తుంది. ఈ సంఘటన విషయమై షాద్‌నగర్‌లో కేసు కూడా నమోదయ్యింది. ఇదిలా ఉంటే.. బా లుడు మృతి చెందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సమాచారాన్ని షాద్‌నగర్ పోలీసులకు అందజేశారు. దీంతో షాద్‌నగర్ పోలీసులు గాంధీ దవాఖానకు వచ్చి బాలుడి ఎముకను భద్రపరచాల్సిందిగా లిఖిత పూర్వకంగా అభ్యర్థించారు. షాద్‌నగర్‌లో కొనసాగుతున్న కేసులో డీఎన్‌ఏ నమూనాల కోసం బాలుడి తొడ భాగం నుంచి కొంత ఎముకను తీసి వైద్యులు భద్రపరిచారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...