సర్పంచులకు వేతనాలు విడుదల


Wed,August 21, 2019 03:32 AM

-త్వరలోనే గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఉన్న మాజీ, నూతన సర్పంచ్‌లకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న వారి వేతనాలు మంజూరు చేసింది. 2017-2018, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.2.23 కోట్లను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నిధులను డీపీవో ఖాతాలో జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా పాత జిల్లాలో 415 పంచాయతీల్లో సర్పంచ్‌లకు పాత వేతనాలు మంజూరు చేశారు. (జనవరి-మార్చి )2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.83 లక్షలు విడుదల చేసింది. ఇక కొత్తగా ఏర్పడ్డ వాటితో కలిపి ప్రస్తుతం 560 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి 2019 ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. తిమ్మాపూర్, కొత్తూరు సర్పంచ్‌ల పదవీకాలం అక్టోబర్ వరకు ఉంది. మొత్తం 560 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌లకు ఐదు నెలలకు సంబంధించిన జీతాలు విడుదల చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1.40కోట్లు మంజూరు చేశారు. మొత్తంగా రూ.2కోట్ల 23లక్షలు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ఖాతాలో జమ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి ఖాతా నుంచి ట్రెజరీకి, అక్కడి నుండి గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి జమ చేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీంతో సీఎం కేసీఆర్‌కు సర్పంచ్‌లు కృతజ్ఞతలు తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...