ట్రాఫిక్ రద్దీని పరిశీలించిన సీపీ


Wed,August 21, 2019 03:32 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బీఆర్‌కే భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ పరిస్థితిని సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌తో కలిసి ఆయన బీఆర్‌కే భవన్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు, లిబర్టీ జంక్షన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉందనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు. బీఆర్‌కే భవనంలోకి సచివాలయంలోని పలు ప్రభుత్వ విభాగాలు మారిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడకు వచ్చే సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లిబర్టీ జంక్షన్ వయా ఐటీ భవన్ మీదుగా తెలుగుతల్లి ైఫ్లె ఓవర్ జంక్షన్ రూట్‌లో వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధిస్తూ, ఈ రూట్‌లో వెళ్లే వాహనాలు లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి వెళ్లాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీపీ అంజనీకుమార్ మంగళవారం ట్రాఫిక్ పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...