నా ఖాతాలోకి 10 లక్షలు పంపండి


Sun,August 18, 2019 12:26 AM

-బ్యాంకు మేనేజర్లనూ బురిడీ కొట్టిస్తున్న సైబర్ మోసగాళ్లు
-రోజూ నాలుగైదు ఫిర్యాదులు
-స్వయంగా బ్యాంకుకు వస్తేనేడబ్బులివ్వండి
-సైబర్ క్రైం పోలీసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబర్ క్రిమినల్స్ నయా నేర ప్రక్రియ బ్యాంక్ మేనేజర్లను ఆర్థిక మోసాల ఊబిలోకి దించుతుంది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని సైబర్ మాయగాళ్లు హైఎండ్ కార్ల షోరూంలను టార్గెట్ చేస్తున్నారు. షోరూంల సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లకు బిస్కెట్ వేస్తున్న సైబర్ మోసగాళ్లు వారి బ్యాంక్ ఖాతాల వివరాలు, షోరూం యజమానుల వివారా లు, బ్యాంక్‌లకు వెళ్లే ఎగ్జిక్యూటివ్ వివరాలు, షోరూం రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీదు ఉందనే వివరాలు ఇలా ప్రతి విషయానికి సంబంధించి సమాచారం సేకరించి వాటితో షోరూం ఖాతాలను బ్యాంక్‌లకు ఫోన్ చేసి లక్షలు టోకరా వేస్తున్నారు. దీంతో బ్యాంక్ మేనేజర్లు షోరూం వారు చేశారు కదా అంటూ ఎలాంటి చెక్, ప్రత్యక్ష మనిషి లేకుండా కేవలం ఫోన్‌లోని మాటలకే నగదును ట్రాన్స్‌ఫర్ చేసి బొక్కబొర్లా పడుతున్నారు.

బిక్కమొహం వేస్తూ షోరూం యాజమాన్యాలు, బ్యాంక్ మేనేజర్ల మధ్య విబేధాలు ఏర్పడుతున్నాయి. నష ్టనివారణ చర్యల్లో భాగంగా చివరకు బ్యాంక్ మేనేజర్లే శాఖపరమైన చర్యలకు గురి కావాల్సి వస్తుం ది. ఈ తరహా సరికొత్త సైబర్ నేరం ఇప్పుడు హైదరాబాద్‌లోని షోరూంల యజమానులు, బ్యాంక్ మేనేజర్లను సైబర్ క్రైం పోలీసుల వద్దకు పరుగులు తీయిస్తుంది. కొంతమంది మోసపోయామని ఫిర్యాదులు ఇస్తుండగా, మరికొంత మంది మాకు ఈ విధంగా ఫోన్‌లు వస్తున్నాయం టూ పోలీసులకు సమాచారం అందిస్తున్న ఫిర్యాదులు కూడా ప్రతిరోజు పెరుగుతున్నాయి. ఈ నయా మోసంతో ప్రతిరోజు సైబర్ క్రైం పోలీసులకు 4 నుంచి 5 ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా సైబర్ జాదూగాళ్లకు చిక్కిన ఓ బ్యాంక్ మేనేజర్ ఏకంగా రూ.10 లక్షలు వారి ఖాతాలోకి బదిలీ చేసి ఊబిలో చిక్కుకున్నాడు.

ఖరీదైన నయా మోసం ఇలా....
సైబర్ మాయగాళ్లు హైదరాబాద్‌లో ఉన్న బడా షోరూంలు, వాటి లొకేషన్స్, షోన్ నెంబర్లు సేకరించుకున్నారు. ఇలా సేకరించుకున్న షోరూంలకు ఫోన్ చేసి మేము మీ షోరూం నుంచి 10 బీఎమ్‌డబ్ల్యూ కార్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సేల్స్‌ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడుతారు. దీనికి మోసగాళ్లు పేరుమోపిన కంపెనీ పేరును వాడుతారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక్కసారిగా కోట్లాది రుపాయాల వ్యాపారం దొరకడంతో పాటు తన ప్రతిభకు, సేల్స్‌కు మంచి కమీషన్ వస్తుందనే ఆనందంలో ఉండిపోతాడు. ఆ సమయంలో సైబర్ క్రిమినల్స్ వారం కిందట మా కంపెనీ సభ్యులు మీ షోరూంకు వచ్చారు. అన్ని కార్లను చూశారని నమ్మిస్తాడు. నేను డబ్బు పంపియాలంటూ కారు షోరూం ఎవరీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, యజమాని పేరు, ప్రతిరోజు షోరూం తరపును ఎవరు బ్యాంక్‌కు వెళతారు, షోరూంకు ఏ బ్యాంక్ లో ఖాతా, ఐఎఫ్‌సీ కోడ్, బ్రాంచి, ఖాతా నెంబర్ ఇతర వివరాలను సేకరిస్తాడు. అనంతరం షోరూంతో లింక్ ఉన్న బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేసిన షోరూం యజమానిని మాట్లాడుతున్నా నేను బోర్డు మీటింగ్‌లో ఉన్న నాకు అత్యవసరంగా నగదు అవసరం ఉంది వెంటనే నేను పంపి ఖాతాలోకి బదిలీ చేయండి మా అకౌంటెంట్ చెక్ తీసుకుని వస్తాడని చెప్పుతాడు.

సాధారణంగా బ్యాంక్ మేనేజర్ షోరూంకు సంబంధించి కోట్లాది రుపాయాల లావాదేవీలు కావడం, వారిపై నమ్మ కం ఉండడంతో వెంటనే బదిలీ చేస్తారు. అలా మూడు గంటలు తర్వాత ఇంకా చెక్కు రాలేదని ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చేస్తాడని నమ్మిస్తాడు. ఒక్కసారిగా నగదు అతని ఖాతాలోకి బదిలీ కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. చెక్ ఇంకా రాలేదని బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ సమాధానం వస్తుంది. అప్పుడు బ్యాంక్ మేనేజర్ తేరుకుని షోరూంకు ఫోన్ చేస్తే అస లు విషయం మోసపోయిన సంగతి తెలుస్తుంది. మా ఖాతాలో నుంచి పోయిన లక్షలాది రుపాయాలను కట్టాలని షోరూం నిర్వాహకులు, బ్యాంక్ మేనేజర్లు కొట్లాడాకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిర్లక్ష్యం బ్యాంక్ వారి నుంచి జరిగింది కాబట్టి బ్యాంక్ అధికారులే షోరూం వాళ్లకి నగదును జమ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఫోన్‌లో అడగ్గానే బదిలీ చేయొద్దు
ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు రోజుకు నాలుగు నుంచి ఐదు వరకు వస్తున్నా యి. అందులో సమాచారం కోసం ఇచ్చిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నా యి. ఫిర్యాదులను పరిశీలించిన తర్వా త బ్యాంక్ మేనేజర్లు ఫోన్‌లో చెప్పగానే నగదును బదిలీ చేయవద్దు. చెక్ తీసుకుని లేదా, ప్రత్యక్షంగా మనిషి వచ్చి నగదు బదిలీకి సంబంధించి రాతపూర్వకంగా పూర్తి చేసిన తర్వాతనే ఇవ్వాలి. ఫోన్‌లో మాట్లాడే మాటలతో అసలు ఇవ్వొద్దు. షోరూం నిర్వాహకు లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా పెద్ద ఆర్డర్ వచ్చిందని ఆనందంలో మునిగిపోయి ఫోన్‌లో మాట్లాడే గుర్తు తెలియని వ్యక్తులకు అన్ని వివరాలను చెప్పొద్దు. బ్యాంక్ ఖాతా వివరాలు, షోరూంతో బ్యాంక్ లింక్ ఉన్న విషయాలను అసలు గుర్తు తెలియని వ్యక్తులకు వివరించొద్దు. ప్రత్యక్షంగా మనిషి వచ్చినప్పుడు షోరూం నిబంధనల ప్రకారమే కొనుగోలుదారులకు వివరాలను వెల్లడించాలి. తాజాగా సంఘటనలను పరిశీలిస్తే సైబర్ మాయగాళ్లు షోరూంల ద్వారా బ్యాంక్ మేనేజర్లకు ఉచ్చు బిగిస్తున్నారని తెలుస్తోంది. ఈ సరికొత్త నేర ప్రక్రియతో బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది, షోరూం నిర్వాహకులు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు అప్రమత్తంగా ఉండాలి.
-సీహెచ్‌వై.శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ సైబరాబాద్ సైబర్ క్రైమ్స్

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...