బీమాతో పెరుగుతున్న ధీమా..


Sun,August 18, 2019 12:17 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : సామూహిక బీమా పథకం రైతుల కుటుంబ సభ్యుల్లో ధీమా పెంచుతుంది. స్వరాష్ట్రంలో అన్నదాతల సంక్షేమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతుబంధు పథకంలో భాగంగా ప్రతి ఎకరానికి రూ.5వేల చొప్పున పంటపెట్టుబడి సాయమందించడంతో పాటు నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసిన ప్రభుత్వం తాజాగా రైతుబంధు సామూహిక బీమా పథకంతో మృతిచెందిన రైతు తెలిపిన నామినీ వ్యక్తుల ఖాతాలో రూ.5 లక్షల బీమా సొమ్మును జమ చేసి రైతన్నలకు బాసటగా నిలుస్తుంది. ప్రమదవశాత్తూ అకాలమరణం పొందిన రైతన్నల కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో దేశంలో మరెక్కడా లేనివిధంగా రైతుబంధుతో పాటు రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి విదితమే. ఈ పథకం కింద మేడ్చల్ జిల్లాలో సామూహిక రైతు బీమా పథకం ద్వారా సుమారు 60 మంది రైతులకు రూ.3 కోట్ల వరకు అందించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కిందటేడాది 2018 ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకం అమలోకి వచ్చింది.

ఇందులో భాగంగా రైతుల నుంచి నయా పైసా తీసుకోకుండా దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 1959 ఆగస్టు 14వ తేదీ నుంచి 2000 ఆగస్టు 15వ తేదీలోపు జన్మించిన రైతులందరికీ (60ఏండ్లలోపు వారికి) ప్రభుత్వమే స్వయంగా రైతుల పేరిట జీవిత బీమా సంస్థకు ఒక్కో రైతుకు ఏడాదికి గాను ప్రీమియం కింద రూ.2,271.50లను చెల్లించింది. ఈ పథకం కింద ఎవరైనా రైతు అకాల మృతిచెందితే ఎల్‌ఐసీ నుంచి రైతు తన బీమా దరఖాస్తులో పేర్కొన్న నామినీకి రూ.5 లక్షల వరకు అందిస్తుంది. జిల్లాలో మొత్తం 14 మండలాలు, 126 రెవెన్యూ గ్రామాలున్నప్పటికీ వీటిలో కేవలం 10 మండలాల పరిధిలోని 114 రెవెన్యూ గ్రామాల పరిధిలోనే వ్యవసాయం చేస్తున్నట్లు గుర్తించిన రైతులు వీటి పరిధిలో 60 ఏండ్లలోపు వయసున్న 10,985 మంది రైతులకు బీమా బాండ్లను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు 10 మండలాల పరిధిలో ఎల్‌ఐసీ నుంచి అర్హులందరికీ బాండ్లు వచ్చాయని, బాండ్లు వచ్చిన అర్హులందరికీ 2018 ఆగస్టు 15వ తేదీ నుంచి బీమా వర్తిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...