అక్రమ నల్లా కనెక్షన్ల తొలగింపు..


Sun,August 18, 2019 12:15 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన ఇద్దరు వ్యక్తులపై జలమండలి అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పేట్‌బషీర్‌బాద్ ప్రాంతంలో ఇంటినెంబర్ 6-264/ 13/1 బీ - 33/1, 6-264/13/1బీ/ 34 భవనాలకు జలమండలి నుంచి ఎలాంటి అనుమతి పొందకుండా నల్లా కనెక్షన్ తీసుకున్నారు. ఇది గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో పాటు సంబంధిత భవన యజమానులు వెంకటరమణ, కె. శంకరయ్యలపై పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ నల్లాకనెక్షన్లను బిగిస్తే 99899 98100, 99899 92268 సమాచారమందించాలని అధికారులు కోరారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...