దోమల నివారణకు డ్రై డేగా ఫ్రైడే


Sat,August 17, 2019 04:39 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దోమల ఉత్పత్తిని అరికట్టేందుకుగాను వాటి ఉత్పత్తి కారకాలు లేకుండా చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలని నిశ్చయించింది. దోమల వ్యాప్తి పెరిగే వీలు ఉండడంతో జీహెచ్‌ఎంసీ దోమల ఉత్పత్తిపై ప్రధాన దృష్టి సారించింది. డ్రైడేలో భాగంగా సెప్టిక్ ట్యాంక్‌లు, టాయిలెట్ల గొట్టాలపై మెష్‌ను ఏర్పాటు చేయడం, ఇండ్లల్లో ఉన్న పాత టైర్లు, కుండలు, కూలర్లలో నీరు నిల్వ లేకుండా తొలిగించడం, లార్వా నివారణకు ఇంటింటికీ తిరుగుతూ రసాయనాలు పిచికారీ చేయడంతోపాటు అన్ని పాఠశాలల్లో అంటువ్యాధులు, దోమల వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై స్కూళ్లలో విద్యార్థులకు అవగాహన కల్పించడం తదితర చర్యలు చేపట్టనున్నారు.

డ్రైనేజీలేని బస్తీలు, కాలనీల్లో సెప్టిక్ ట్యాంక్‌లపై ఉన్న ఎయిర్ పైప్‌లపై మెష్‌లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఇప్పటికే చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగరంలోని 100కుపైగా పాఠశాలల్లో 30వేలకుపైగా విద్యార్థులకు అంటువ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు కమిషనర్ దానకిశోర్ వివరించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...