50 మైక్రాన్ల కన్నా తక్కువ కవర్లపై నిషేధం


Sat,August 17, 2019 04:38 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పూలబొకేలకు ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం విధించనున్నట్లు కమిషనర్ దానకిశోర్ ప్రకటించారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లపై ఇప్పటికే నిషేధం ఉన్నందున వీటిని పుష్పగుచ్ఛాలకు చుట్టడాన్ని కూడా త్వరలోనే నిషేధం విధించనున్నట్లు ఆయన చెప్పారు. పూలబొకేల తయారీదారులతో శుక్రవారం కమిషనర్ దానకిశోర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి ముప్పుగా పరిణమించినందున ప్లాస్టిక్‌కు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని ఆయన సూచించారు. బట్ట, పేపర్, జనపనార, బయోడిగ్రేడబుల్ కవర్లు తదితర వాటిని ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ప్రత్యామ్నాయాలు అనుసరించేవారికి ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదన ఉందని వివరించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...