నూతన ఆవిష్కర్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది


Sat,August 17, 2019 04:36 AM

మేడ్చల్ కలెక్టరేట్ : నూతన ఆవిష్కర్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మేడ్చల్ కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా 17 అంశాలపై ఆవిష్కర్తలచే వారి ఆవిష్కరణలను కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఆవిష్కరణలను ప్రదర్శించారు. ముఖ్యంగా సోలార్ పవర్ ద్వారా నడిచే ప్లోర్ మిల్, స్కిమ్మర్, విద్యుత్ వాహనాలు, గడ్డి కత్తిరించే ఉపకరణలను ప్రదర్శించారు. జేసీ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...