బోధి యోగా ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ


Sat,August 17, 2019 04:32 AM

తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 16 : యోగా విద్యను బహుళవ్యాప్తం చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో యోగా గురువులచే ఉచిత శిక్షణను అందించనున్నామని బోధి అకాడమీ ఆఫ్ యోగా మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ వెంకినేని తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధి యోగా ఇంటర్నేషనల్ ఫ్రీ టీచర్ ట్రైనింగ్ పోస్టర్‌ను సీనియర్ యోగా గురువులు వైష్ణవి, కృష్ణప్రియ, ప్రార్థనతో పాటు పలువురు బోధి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ వెంకినేని మాట్లాడుతూ శిక్షణా సమయంలో నెలకు 5వేలు శిక్షణ బృతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతగా ఆర్థికంగా వెనకబడిన 50మందిని ఎన్నుకుని ఉచితంగా నేర్పిస్తామన్నారు. ఈ శిక్షణలో యోగాతో పాటు సాఫ్ట్ స్కిల్స్‌లో కూడా శిక్షణ కొనసాగుతుందని, తదనంతరం విజయవంతంగా యోగా గురువు విద్యను పూర్తి చేసిన వారికి నెలకు 15వేలు మొదలు కొని 25వేల వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ నెల 26వ తేదీనుంచి 30వ తేదీ వరకు యోగా గురువు శిక్షణ కోసం ఆసక్తి గలవారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కనీసం డిగ్రీ పూర్తి చేసి స్పష్టంగా మాట్లాడగలిగే వారు ఇంటర్వ్యూకు హాజరుకావాలని, వివరాలకు 9870347348 సంప్రదించవచ్చని తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...