నెలాఖరులోగా ఖాళీల భర్తీకి రంగం సిద్ధం


Sat,August 17, 2019 04:31 AM

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : పంచాయతీ గ్రామ కార్యదర్శి మొదలు జిల్లా పరిషత్ సీఈవో వరకు ఒక పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇన్‌చార్జీల పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అర్హత ఉన్న అధికారులకు పదోన్నతులు కల్పించనుంది. ఈమేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులపై కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించింది. జిల్లాలో మొత్తం 8 ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉండగా పదోన్నతుల ద్వారా వాటిని భర్తీ చేయనున్నారు.

ఈనెలాఖరు వరకు ప్రభుత్వం వీరికి పోస్టులు ఇచ్చే అవకాశం ఉన్నది. జిల్లాలో ఐదు డివిజన్లు ఉండగా జిల్లాకు ఒకే ఒక డీఎల్‌పీఓ పనిచేస్తున్నారు. ఇక నుంచి జిల్లాలోని ఐదు డివిజన్లకు ఐదు డీఎల్‌పీఓలను నియమించనున్నారు. జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ డివిజన్లు ఉన్నాయి. వీటన్నింటికి త్వరలో డీఎల్‌పీఓలను నియమించనున్నారు. జిల్లాలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ ఈఓఆర్డీలకు కూడా పదోన్నతులు కల్పించనున్నారు. వారిని కూడా ఈనెలాఖరులోగా డీఎల్‌పీఓగా నియమించనున్నారు.

ఇందులో జూనియర్‌గా ఉన్న ఈఓఆర్డీలకు ఎండీఓలుగా ప్రమోషన్ కల్పిస్తున్నారు. ఆరవ జోన్‌లో 69 డీఎల్‌పీఓలు ఖాళీలు ఉన్నాయి. ఇందులో 60 నుంచి 64 వరకు భర్తీ చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో పదోన్నతులకు అవకాశం ఉన్న 10 మంది సూపరింటెండెంట్లు, 11 మంది సీనియర్ అసిస్టెంట్లు మొత్తం 21 మందికి సంబంధించి స్పెషల్ అసెస్‌మెంట్ రిపోర్టును జిల్లా పరిషత్ అధికారులు ప్రభుత్వానికి పంపించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...