ఎయిర్‌పోర్టులో ఆకట్టుకున్న యాంటి-హైజాక్ మాక్ డ్రిల్


Fri,August 16, 2019 01:23 AM

శంషాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యాంటి-హైజాక్ మాక్‌డ్రిల్ ఎమర్జెన్సీ ఎక్సైజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భద్రతా దళాల మాక్‌డ్రిల్ విశేషంగా ఆకట్టుకున్నది. ఏఏఐ, బీసీఏఎస్, క్విక్ రెస్పాన్స్ టీం, సీఐఎస్‌ఎఫ్, బాంబు, డాగ్ స్కాడ్ తదితర భద్రతా బృందాలు సంయుక్తంగా నిర్వహించిన మాక్‌డ్రిల్ విజయవంతంగా జరిగింది. కొంతకాలంగా కీలక ప్రాంతాలతోపాటు నిషేధిత ప్రదేశాల్లో చోటుచేసుకుంటున్న ఉగ్రవాద దాడులు, విమానాలు హఠాత్తుగా కూలడం, ప్రమాదాలకు గురికావడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీఏఓ, డీజీసీఏ, ఇతర నిఘా వర్గాల హెచ్చరికలతో పాటు ఆయా భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఎయిర్‌పోర్టులో అనూహ్య పరిణామాలు సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై ఈ మాక్‌డ్రిల్ నిర్వహించారు. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఐసీసీఏఓ, డీజీసీఏల ఆదేశాను సారం ఎయిర్‌పోర్టులో మాక్‌డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...