విద్యార్థులు గ్రంథ పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి


Fri,August 16, 2019 01:22 AM

అంబర్‌పేట, నమస్తే తెలంగాణ : విద్యార్థులు గ్రంథ పఠనంపై ఆసక్తిని పెంచుకోవాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. గ్రంథ పఠనం ద్వారా ఎన్నో విషయాలు దోహదపడుతాయని చెప్పారు. గురువారం న్యూనల్లకుంటలోని బ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో హాస్టల్ ట్రస్టు సమావేశం జరిగింది. హాస్టల్ ట్రస్టు అధ్యక్షుడు మంత్రి రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదును పెట్టి నూతన ఆవిష్కరణల కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.

దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన దేశ భక్తులను స్మరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఉన్నత చదువుల కోసం నగరానికి వస్తున్న బ్రాహ్మణ విద్యార్థులకు నామ మాత్రపు రుసుంతో వసతి కల్పించడమే కాకుండా భోజనం అందిస్తున్న బ్రాహ్మణ హాస్టల్ ట్రస్టు సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. విశ్రాంత అడిషనల్ ఎస్సీ సీవీ సుధాకర్‌రావు మాట్లాడుతూ అగ్రవర్ణాలకు చెందినప్పటికీ బ్రాహ్మణుల్లో చాలా మంది నిరుపేదలున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ హాస్టల్ ట్రస్ట్ కార్యదర్శి మురళీప్రసాద్, కోశాధికారి ఆర్‌ఎస్‌కె భూపాల్‌రావు, సీహెచ్ మురళీకృష్ణ, ట్రస్టు సభ్యులు, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...