పిల్లలకు పౌష్టికాహారం అనగనగా చిక్కి


Fri,August 16, 2019 01:21 AM

-మణికొండ, ఖానాపూర్ పాఠశాలల్లో ఉచితంగా పంపిణీ చేసిన నిర్వాహకులు
మణికొండ, నమస్తే తెలంగాణ : బెల్లం, పల్లీ, దేశీ ఆవు నెయ్యి, అవిశ గింజలకు తోడు మునగాకు.. ఇంకేముంది? అన్నీ సమృద్ధిగా పోషకాలు కలిగినవే. ఈ కాంబినేషన్‌తో అనగనగా బ్రాండ్‌తో తయారు చేసిన చిక్కి రుచి ఆహా అనిపించింది. ఇద్దరు ఉన్నత విద్యావంతులు ఊరె ప్రశాంత్, రాజేశ్‌లు నెలకొల్పిన వీ అండ్ వీ అనే సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన అనగనగా అనే బ్రాండ్ చిక్కిని ప్రముఖ హీరో కార్తికేయ గురువారం ఆవిష్కరించారు. ఆ తర్వాత మణికొండ జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు, ఖానాపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అనగనగా రుచి ఎంతో బాగుందని ప్రశంసించారు. మునగాకు, బెల్లం, పల్లీ, దేశీ ఆవు నెయ్యితో తయారు చేసి పిల్లల్లో పౌష్టికాహార లోపాలను నివారించేందుకు ఈ చిక్కి ఎంతగానో ఉపయోగపడుతుందని మాజీ ఎంపీపీ మల్లేశ్, మణికొండ మాజీ సర్పంచ్ నరేందర్‌రెడ్డి అన్నారు.

వీఅండ్ వీ సంస్థ వారు లాభాపేక్షను పక్కనబెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థుల్లో కొరవడుతున్న క్యాల్షియం లోపాలను నివారించేందుకు సమృద్ధిగా పోషకాలున్న ఈ చిక్కి ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. వేర్వేరుగా అందజేసిన ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిరంజన్, మాంగ్యనాయక్, అనిత, మాజీ సర్పంచ్ నర్సింహ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం. రాఘవరెడ్డి, మణికొండ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు సిద్దప్ప, విద్యాకమిటీ చైర్మన్లు బాల్‌రాజ్, లక్ష్మీనారాయణ, నాయకులు బీరప్ప, రవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...