భారీ జాతీయ జెండాకు ఎల్‌ఈడీ వెలుగులు


Fri,August 16, 2019 01:20 AM

-ప్రారంభించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సంజీవయ్య పార్కులో ఏర్పాటైన భారీ జాతీయ జెండా ఇక రాత్రి సమయాల్లోనూ ధగధగలతో కనువిందు చేయనున్నది. ఈ జాతీయ జెండా మరింత ఆకర్షణీయంగా కనబడేలా హెచ్‌ఎండీఏ ఎప్పటికప్పుడు కొత్త అందాలను సమకూర్చుతున్నది. ఇందులో భాగంగానే తాజాగా వెలుగుల నడుమ జాతీయ జెండా కనిపించేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ ఎనిమిది ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. ఈ ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టంను గురువారం సీఎస్ ఎస్‌కే జోషి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, సెక్రటరీ రాంకిషన్, ఎస్‌ఈ పరంజ్యోతి, డైరెక్టర్ శ్రీనివాస్, కియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...