త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించింది..


Fri,August 16, 2019 01:19 AM

-కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:ఎంతో మంది అమరులు, త్యాగాల ఫలితంగా మనకు స్వాతం త్య్రం సిద్ధించిందని జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ అన్నారు. గురువారం నాంపల్లిలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా సంయుక్త కలెక్టర్ గుగులోతు రవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీ భూపాల్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు అనిల్‌కుమార్, సూర్యలత, కేఎస్‌బీ కుమారీ, విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ, డీఎంఅండ్‌హెచ్‌వో డా. టి.వెంకటి, సీపీవో బలరాం, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ డీడీ రామారావు, యువజన, క్రీడల అధికారి సుధాకర్‌రావు, ఎంబీ కృష్ణాయాదవ్ పాల్గొన్నారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు కలెక్టర్ నోటుపుస్తకాలు అందజేశారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...