నగరాభివృద్ధిలో హెచ్‌ఎండీఏ పాత్ర అభినందనీయం


Fri,August 16, 2019 01:18 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ అభివృద్ధిలో హెచ్‌ఎండీఏ పోషిస్తున్న పాత్ర అభినందనీయమని పట్టణాభివృద్ధి, పురపాలక పాలనా విభాగం ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ అన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడుతూ హెచ్‌ఎండీఏలో ఉద్యోగుల కొరత ఉన్నా సమష్టి కృషితో పలు సమస్యలను అధికమిస్తున్నారని అభినందించారు.

కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ కార్యదర్శి ఎం. రామ్‌కిషన్, అర్బన్ ఫారెస్ట్ విభాగం డైరెక్టర్ శ్రీనివాస్, ప్లానింగ్ విభాగం డైరెక్టర్లు బాలకృష్ణ, నరేంద్ర, శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ హరినాథరెడ్డి, ఎస్‌ఈలు మాజీద్ షరీఫ్, ముజఫర్ ఇమామ్, సీహెచ్ పరంజ్యోతి, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, డీఎస్‌పీ జగన్, డీఏవోలు సరస్వతి, విజయ్‌కుమార్, వెంకటేశ్వరరెడ్డి, డేనియల్ సుధాకర్, ప్రభాకర్‌రావు, డిప్యూటీ కలెక్టర్లు రాజేశ్వరీ, ఎస్ ఆపర్ణ, పీఆర్వో సీహెచ్ లలిత, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రత్యేకమైన పలు మొక్కల విత్తనాలతో కూడుకున్న జెండా స్టిక్కర్లను పంచారు. ఆ స్టిక్కర్లు వాడి పారేసిన తర్వాత అవి మొక్కలుగా మారడం ప్రత్యేకత అని శ్రీనివాస్ తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...