ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తాం


Thu,August 15, 2019 02:42 AM

-ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ రవీంద్రబాబు
సిటీబ్యూరో/మన్సూరాబాద్, నమస్తే తెలంగాణ : ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఆంధ్రాబ్యాంకు ఎల్లప్పుడు ముందు ఉంటుందని ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయం హైదరాబాద్-2 జోనల్ మేనేజర్ ఎం. రవీంద్రబాబు తెలిపారు. ఎల్బీనగర్ రాక్‌టౌన్‌కాలనీలోని తబలా హోటల్‌లో బుధవారం ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయం హైదరాబాద్-2 ఆధ్వర్యంలో చిన్నతరహా పరిశ్రమలు, వ్యక్తిగత రుణగ్రహితలతో సమావేశం నిర్వహించారు. బ్యాంకు అందిస్తున్న సేవలు, ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకు హైదరాబాద్-2 జోన్ పరిధిలోని 78శాఖల ద్వారా రూ.11,150కోట్ల వ్యాపారంతో తమ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులో రూ.7,550కోట్ల డిపాజిట్లు కలిగి ఉండగా, రూ.3,600 కోట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గృహా, విద్యా అవసరాలకు, వ్యవసాయంతో అనుబంధ రంగాలకు రుణాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. బ్యాంకు ఏజీఎం కల్పన, చీఫ్ మేనేజర్లు టీహెచ్ పతాంజలి, రవికుమార్ పాల్గొన్నారు.

కోఠిలో.. : కోఠీలో ఆంధ్రాబ్యాంకు భవనంలో బుధవారం బ్యాంకు జోనల్ మేనేజర్ రాజేంద్రకుమార్ అధ్యక్షతన వినియోగదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా శాఖల బ్రాంచ్ మేనేజర్లు, చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపార రుణగ్రహీతలు పాల్గొన్నారు. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్) వల్ల తగ్గుతున్న వడ్డీభారంపై ఈ సందర్భంగా వినియోగదారులకు వివరించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...