క్రైస్తవులకు.. బ్యాంక్ లింకేజీ రుణాలు


Thu,August 15, 2019 02:42 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : క్రైస్తవ అల్పసంఖ్యాకవర్గాల ఆర్థిక సంస్థ ద్వారా క్రైస్తవులకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహ్మద్ ఖాసీం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 -20 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికకు ఆశావాహుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఏదేనీ జాతీయ బ్యాంక్ నుంచైనా రుణ అంగీకర పత్రాలు సమర్పిస్తే.. యూనిట్ విలువ రూ.లక్షకు 80 శాతం, 1- 2 లక్షల వరకు 70 శాతం, 2-10 లక్షల వరకు 60 శాతం రాయితీ ఇవ్వనున్నామన్నారు. రుణం ఎంతైనా.. గరిష్టంగా 5 లక్షల వరకు సబ్సిడీని మంజూరు చేస్తామన్నారు. మిగతా మొత్తాన్ని రుణంగా బ్యాంక్ నుంచి పొందాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారులు 21 - 55 ఏండ్ల మధ్య వయస్సు వారై, వార్షికాదాయం రూ.2లక్షల లోపు ఉండాలన్నారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు tsobmms.cgg.gov.in, tscmfc.in వెబ్‌సైట్‌లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 040 -23391607, 23240134, హజ్‌హౌస్ 6వ అంతస్తులోని కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...