విదేశీ విద్యార్జనకు ట్రావెల్ ఫండ్


Thu,August 15, 2019 02:39 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాజా బహదూర్ వెంకట రామరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ముందుకొచ్చింది. ఉన్నత విద్యార్జనకు వెళ్లే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కుటుంబీకులైన విద్యార్థులకు ట్రావెల్ ఫండ్ కింద ప్రయాణ ఖర్చును సమకూర్చబోతున్నది. వడ్డీ రహిత మొత్తాన్ని విద్యార్థులు మూడేండ్ల తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు www.rbvrres వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలని, పూర్తిచేసిన దరఖాస్తులతో పాటు I -20 కాపీలను ఆగస్టు 26లోపు సమర్పించాలని సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 31వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...