ఇండియన్ పోలీస్ మెడల్‌కు..గౌస్ మొయినుద్దీన్ ఎంపిక


Thu,August 15, 2019 02:38 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబరాబాద్ స్పెషల్ బ్రాంచి అదనపు డీసీపీ గౌస్ మొయినుద్దీన్ ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. విధుల్లో అతని ఉత్తమ సేవలను గుర్తించి కేంద్ర హోం శాఖ మొయినుద్దీన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 1985లో పోలీసు శాఖలో చేరిన గౌసుమొయినుద్దీన్ నిజామాబాద్, సైబరాబాద్ పరిధిలో ఇన్‌స్పెక్టర్‌గా, 2009లో ఏసీపీ పదోన్నతి పొంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా, సీఐడీ సైబర్‌క్రైం, బోధన్ డీఎస్పీగా పని చేశారు. 2017 అదనపు డీసీపీగా పదోన్నతి పొందారు. ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన గౌస్ మొయినుద్దీన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...