గోల్కొండ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు


Wed,August 14, 2019 12:40 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గోల్కోండ కోటలో గురువారం ఉదయం 10 గంటలకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
-ఏబీసీ స్టిక్కర్స్ ఉన్న వాహనాలను ఉదయం 7.30 గంటల నుంచి 11 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ రూట్‌లో అనుమతిస్తారు.
-సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏబీసీ పాస్ కల్గిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలానగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని, బాలిక భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ైైఫ్లెఓవర్, లంగర్‌హౌస్, టిప్పుఖాన్ బ్రిడ్జ్, రాందేవ్‌గూడ రైట్ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి, అక్కడ నుంచి వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కు చేయాలి. ఏ కారు పాస్ కల్గిన వాళ్లు, గోల్కొండకోట గేట్ ఎదుట మెయిన్ రోడ్డులో ఫతే దర్వాజ రోడ్డులో, బీపాస్ కల్గిన వాహనాలను గోల్కొండ బస్ స్టాప్ వద్ద పార్కు చేయాలి. సీకారు పాస్ ఉన్నవాళ్లు బస్‌స్టాప్ వద్ద ఉన్న పుట్‌బాల్ గ్రౌండ్ వద్ద పార్కు చేయాలి. డీపాస్ కల్గిన వాళ్లు షేక్‌పేట నాలా, టోలిచౌక్, సేవన్ టూంబ్స్ వైపు నుంచి బంజారా దర్వాజ నుంచి వచ్చి ప్రియదర్శిని స్కూల్‌లో వాహనాలను పార్కు చేయాలి. ఈకారు పాసు ఉన్న వారు సెవెన్‌టూంబ్స్, బంజారాదర్వాజ నుంచి వచ్చి ఓవైసీ గ్రౌండ్, జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌం డ్‌లో పార్కు చేయాలి. ఎఫ్ కారుపాస్ కల్గిన సాధారణ ప్రజలను లంగర్‌హౌస్ ైప్లెవోర్ కింద నుంచి వచ్చి ఫతే దర్వాజ మీదుగా వచ్చి వాహనాలను హుడా పార్కు, షేక్‌పేట్, టోలిచౌకి నుంచి వచ్చే వాహనాలను సెవెన్ టూంబ్స్‌లో పార్కు చేయాలి, ఈ రెండు రూట్లలో ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతాయి.

-వేడుకలు పూర్తయిన తర్వాత ఏబీసీ కారు పాస్‌హోల్డర్స్ మాకై దర్వాజా, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్ వైపు నుంచి బయటకు వెళ్లిపోవాలి, డీ కారు పాస్ హోల్డర్స్ బంజారా దర్వాజ, సెవెన్ టూంబ్స్ వైపు నుంచి వెళ్లాలి. ఇ పాస్ కల్గిన వారు బడాబజార్, ఫతే దర్వాజా, సెవెన్ టూంబ్స్ నుంచి, ఎఫ్ పాస్ కల్గన సాధారణ ప్రజలు వారి పార్కింగ్ స్థలాల నుంచి సూచించిన రూట్‌లలో బయటకు వెళ్లిపోవాలి.
-పాస్ హోల్డర్స్ పాసులు ఎడమ వైపు విండ్ స్క్రీన్‌కు అతికించాలని, దాంతో పాసులను ఈజీగా గుర్తించేందుకు వీలుంటుందని సూచించారు. వాహనదారులందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి.

సికింద్రాబాద్‌లో...
పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల సందర్భంగా తివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బండ్, ఎన్‌సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయి.

టిఫిన్ బాక్సులు.. కెమెరాలు... సూట్‌కేసులతో రావొద్దు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు వచ్చే ప్రజలు హ్యాండ్‌బ్యాగ్స్, సూట్‌కేస్, కెమెరా, టిఫిన్ తదితర వస్తువులను తెచ్చుకోవద్దని సీపీ అంజనీకుమార్ సూచించారు. ఎవరి వద్దనైనా వస్తువులు కన్పిస్తే పోలీసు సిబ్బంది తనిఖీలు చేస్తారని, భద్రత దృష్ట్యా ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ, సహకరించాలని సీపీ కోరారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...