ఏసీపీకి కేంద్ర పతకం


Wed,August 14, 2019 12:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ చార్మినార్ : కేసుల విచారణలో ఉత్తమ ప్రతిభ చూపిన హైదరాబాద్ ఏసీపీ మోహన్‌కుమార్‌కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎక్సలెన్స్ అవార్డును ప్రకటించింది. ప్రస్తుతం సౌత్ జోన్ స్పెషల్ బ్రాంచ్‌లో ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మోహన్‌కుమార్ పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే సమయంలో రెండు కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరచడంతో 2019వ సంవత్సరానికి ఈ అవార్డును ప్రకటించారు. 2015లో ఒక హత్య కేసులో ఐదు మంది నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు ఛార్జీ షీట్ సమర్పించడంతో వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. 2016లో జరిగిన లైంగిక దాడి ఘటనలో దర్యాప్తు జరిపి నిందితుడిపై ఛార్జీషీట్ కోర్టుకు దాఖలు చేయడంతో వాదనలు విన్న న్యాయస్థానం పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రాష్ట్రంలో ఇద్దరు పోలీసు అధికారులకు ఈ అవార్డు వరించగా అందులో మోహన్‌కుమార్ ఒకరు. ఇదిలాఉండగా అవార్డు పొందిన మోహన్‌కుమార్‌ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అభినందించారు. a

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...