5300 మెట్రిక్ టన్నుల జంతు వ్యర్థాల తొలగింపు


Wed,August 14, 2019 12:36 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బక్రీద్ సందర్భంగా నగరంలో 5300మెట్రిక్ టన్నుల జంతు వ్యర్థాలు వెలువడగా, వాటిని తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ ప్రకటించారు. ఈ వ్యర్థాలను జవహర్‌నగర్ డంప్‌యార్డుకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు బక్రీద్‌ను నిర్వహిస్తున్నందున ఎప్పటికప్పుడు రహదారులపై నుంచి వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, వ్యర్థాల పరిమాణం మరింత పెరుగుతుందని తెలిపారు.

బక్రీద్ పండుగ ఏర్పాట్లలో భాగంగా రూ. 2.43కోట్ల వ్యయంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక లైటింగ్, జీవ వ్యర్థాల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకు గాను గత మూడు రోజులుగా 3.69 లక్షల బ్లాక్ కవర్లను వ్యర్థాలు వేసేందుకు పంపిణీ చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణకోసం ఈసారి బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను పంపిణీ చేసినట్లు వివరించారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న చార్మినార్‌జోన్‌లో వ్యర్థాల తొలగింపునకు 50జేసీబీలు, 94మినీ టిప్పర్లు, 108 పది టన్నుల వాహనాలు, 25టన్నుల సామర్థ్యంగల 48 వాహనాలు కలిపి మొత్తం 295 వాహనాలను కేటాయించినట్లు కమిషనర్ వివరించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...